ఆర్మూర్‌కు వంద వాహనాలతో బయలుదేరిన జగన్

YS Jagan
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతు దీక్ష చేపట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరారు. వందకు పైగా వాహనాలు వెంట రాగా, మందీమార్బలంతో ఆయన దీక్షకు బయలుదేరారు. దారిలో హైదరాబాదులోని పంజాగుట్ట వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, బోయినపల్లిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొండా సురేఖ, కొండా మురళి దంపతులు, శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు ఆయనతో పాటు ఉన్నారు. మధ్యాహ్నం ఆయన ఆర్మూరు చేరుకునే అవకాశం ఉంది. ఆయన దీక్షకు ఆర్మూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాగా, జగన్ దీక్ష సందర్భంగా పోలీసులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి కార్యకర్తలను పెద్ద యెత్తున అరెస్టు చేశారు. ఆర్మూరులో విద్యార్థులు విద్యాసంస్థల బంద్ పాటించారు. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావుకు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అరెస్టులు పెద్ద యెత్తున జరిగాయి. హైదరాబాదు నుంచి బయలుదేరే ముందు వైయస్ జగన్ మీడియాకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. జగన్ రెండు రోజుల పాటు 48 గంటలు రైతు దీక్ష చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+