బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం: చిరంజీవి

Chiranjeevi
విశాఖపట్నం: సినీ హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి కాంగ్రెసు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి నిరాకరిస్తూనే గమ్మత్తయిన వ్యాఖ్య చేశారు. బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వమని ఆయన వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తొలిసారి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం నుంచి అరుకు బయలుదేరే ముందు ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సామాజిక న్యాయం చేస్తానని చెప్పిన నాయకుడు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని బాలకృష్ణ ఇటీవల తన కృష్ణా జిల్లా పర్యటనలో అన్నారు.

దీక్షలు ఎవరు చేసినా చిత్తశుద్ది ఉండాలని చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తలపెట్టిన దీక్షపై అన్నారు. సంక్రాంతి తర్వాత తమ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి వస్తుందని, ఈ నెల 19వ తేదీన శ్రీనివాస రావుకు మంత్రి పదవి ఖాయమని ఆయన అన్నారు. అరకుతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన అన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో కొత్త శాసనసభ్యులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+