చిరంజీవిపై బాలయ్య ఫ్యాన్స్ గరం, దిష్టిబొమ్మ దగ్ధం

Balakrishna
కర్నూలు: నందమూరి అందగాడు బాలకృష్ణపై తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు మండిపడ్డారు. చిరంజీవి వ్యాఖ్యలను నిరసిస్తూ బాలయ్య అభిమానులు బుధవారం కర్నూలు జిల్లాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాజ సేవ చేసేందుకే బాలయ్య రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్న చిరంజీవికి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న బాలయ్యను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే సహించేది లేదన్నారు.

కాగా రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో బాలయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో వచ్చిన వారు చేసిందేమీ లేదని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. దానికి చిరంజీవి మంగళవారం స్పందించారు. బాలకృష్ణ తనకు మంచి మిత్రుడని చెబుతూనే ఆయనది పసిపిల్లాడి మనస్తత్వమని, అలాంటి వ్యక్తి మాట్లాడే మాటలకు అర్థం ఉండదని, వాటికి అంతగా డెప్త్ ఉండదని, కాబట్టి వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+