అండమాన్ అర్ధనగ్న ప్రదర్శనపై చర్యలు: కిషోర్ చంద్రదేవ్

Kishore Chandradev
న్యూఢిల్లీ: అండమాన్‌లో గిరిజనుల అర్ధనగ్న ప్రదర్శనలు నాలుగేళ్ల నాటి కిందటి వ్యవహారమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బుధవారం న్యూఢిల్లీలో చెప్పారు. అండమాన్‌లోని జారువా తెగ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అండమాన్‌లో జరిగిన అర్ధనగ్న నాట్యాలపై స్థానిక అధికారులతో కేంద్రహోంమంత్రి మాట్లాడారని చెప్పారు. ఇలాంటి ప్రదర్శనలు ఇకముందు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ వీడియోలని నెట్‌లో పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అండమాన్ టూరిజం కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

కాగా అండమాన్‌లో జారువా గిరిజనులకు చెందిన ఓ అర్దనగ్న ప్రదర్శన వీడియోను బ్రిటన్ పత్రిక ఒకటి ఇటీవల విడుదల చేసిన విషయం సంచలనం సృష్టించింది. స్థానిక పోలీసు అధికారి డబ్బులు తీసుకొని పర్యాటకులను ఉత్సాహపరిచేందుకు కొందరు జారువా స్త్రీలతో అర్ధనగ్న ప్రదర్శన ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అరటి పళ్లు తదితర ఆహార పదార్థాలు ఇస్తామని చెప్పి వారితో ప్రదర్శన చేయించారు. ఈ వీడియో పదేళ్ల క్రితందని అండమాన్ డిజిపి చెప్పారు. ఈ వీడియోపై హోంశాఖ కన్నెర్ర చేసింది. ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించింది. ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+