అందుకే వెర్రి!: ధనుష్ కొలవెరిపై రాఘవులు కామెంట్

ప్రతి అడుగులోనూ ఎరుపుండాలని, కానీ అది కల్తీ కావొద్దని ఆయన అన్నారు. అభ్యుదయ భావనలు ఏ రంగంలో ఉన్నా స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలను మలిచే విధానంలో సాంస్కృతిక రంగానిదే కీలకపాత్ర అన్నారు. సమావేశానికి ముందు ఓ తమిళ కామ్రేడ్ తనకు తారసపడ్డారని, కొలవెరి సరే ఆ డీ ఏమిటని ప్రశ్నిస్తే తనకు కూడా తెలియదన్నారని చెప్పారు. మనదే అభ్యుదయం అనుకుంటే సరిపోదని, హాలీవుడ్ దర్శకుడు హిచ్ కాక్ సినిమాల్లోనూ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా వర్గ విశ్లేషణ ఉందన్నారు. సాంస్కృతిక, సాహిత్య, సినిమా కళా రంగాల్లో పెరిగిపోతున్న వ్యాపార సంస్కృతికి ప్రత్యామ్నాయాన్ని తీసుకురానున్నామని ప్రకటించారు. ప్రజల్లో మానవత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని పెంచే సంస్కృతిని పెంచేదిశగా మహాసభ నిర్ణయాలుంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications