నేను మీ వాడిని, ఇక్కడే పుట్టి పెరిగాను: చంద్రబాబు

Chandrababu Naidu
తిరుపతి: నేను మీ వాడిని అని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. ఆయన తన స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు శుక్రవారం హైదరాబాద్ నుండి బయలుదేరి తిరుపతి వెళ్లారు. అనంతరం అక్కడ ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నిత్యావసర వస్తువుల పెరుగుదలతో సంక్రాంతి పండుగ కూడా సరిగా చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతికి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే కారణమన్నారు. అవినీతి నిర్మూలనకు యువత చొరవ చూపాలని సూచించారు. ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రభుత్వం ప్రజలను పీడిస్తోందన్నారు.

తన వైఖరితో కాంగ్రెసు టిటిడిని కూడా అపవిత్రం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు స్వాగతం పలకడానికి భారీ ఎత్తున అభిమానులు, టిడిపి కార్యకర్తలు వచ్చారు. అక్కడ నుండి ఆయన నారావారిపల్లి చేరుకున్నారు. కాగా హీరో నందమూరి బాలకృష్ణ రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో రాలేక పోయారని తెలుస్తోంది. చంద్రబాబు రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+