యోగా గురు బాబా రామ్‌దేవ్ ముఖంపై నల్ల సిరా

రామ్‌దేవ్‌పై దాడి చేసిన వ్యక్తిని కమ్రాన్ సిద్ధిఖిగా గుర్తించారు. బాట్లా ఎన్‌కౌంటర్‌పై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆతను ఈ పనికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అతను ఓ ఎన్‌జివోలో పనిచేస్తున్నాడు. నల్లధనాన్ని భారదేశానికి తీసుకురావాలని తాను అడుగుతుంటే నల్ల సిరా ఇచ్చారని రామ్‌దేవ్ అన్నారు. సత్యం కోసం పోరాడే వారు మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. ఈ సంఘటన తనపై ప్రభావం చూపబోదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications