భాను కిరణ్ శాటిలైట్ ఫోన్ వాడుతున్నాడా?

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో పరారీలో ఉన్న భాను కిరణ్ శాటిలైట్ ఫోన్ వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. మొబైల్ ఫోన్ వాడితే తమకు చిక్కే అవకాశం ఉండడంతో శాటిలైట్ ఫోన్‌ మాత్రమే అతను వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఇతర రాష్ట్రాల్లోని గ్యాంగ్‌స్టర్స్‌తో సంబంధాల్లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. సరిహద్దులను దాటించిన శాటిలైట్ ఫోన్ అతనికి అందుబాటులోకి వచ్చి ఉంటుందని, దాన్నే అతను వాడుతూ ఉండవచ్చునని అంటున్నారు. దాన్ని పట్టుకోవడం కష్టమని కూడా అంటున్నారు.

డబ్బులు పొందడానికి భాను కిరణ్‌కు తగిన సౌకర్యాలు ఉన్నాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ముజీబ్ శాటిలైట్ ఫోన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. అలాగే, గ్యాంగస్టర్, కిడ్నాపర్ అలీ భాయ్ కూడా శాటిలైట్ ఫోన్ వాడాడు. మావోయిస్టులు కూడా శాటిలైట్ పోన్‌లు వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భాను కిరణ్ 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. ఆ మధ్య పోలీసులకు లక్నోలో నకిలీ పాస్‌పోర్టుతో పాటు వివిధ అవతారాల్లో ఉన్న 10 భాను కిరణ్ ఫోటోలు కూడా దొరికాయి. ఆ ఫొటోలను అన్ని విమానాశ్రయాలకు లుక్ నోటీసులతో పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+