పోటీ చేయకండి: కడియం శ్రీహరికి టిఆర్ఎస్ ఝలక్

Kadiyam Srihari
వరంగల్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు మంగళవారం ఝలక్ ఇచ్చారు. కడియం ఉదయం ధర్మసాగర్ మండలం కమ్మరిపేటలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కమ్మరిపేట టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డగించారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయవద్దని వారు కడియంకు సూచించారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లి పోవాలని డిమాండ్ చేస్తూ గో బ్యాక్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ కోసం పదవీ త్యాగం చేసిన రాజయ్యకే ఓట్లు వేస్తామని చెప్పారు. ప్రచారం కోసం తమ గ్రామం రావాల్సిన అవసరం లేదన్నారు. మొదట తెలంగాణపై టిడిపి వైఖరి వెల్లడించాక రావొచ్చన్నారు.

కడియంను అడ్డుకోవడంతో స్థానిక టిడిపి కార్యకర్తలు టిఆర్ఎస్‌ను ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా తెలంగాణ వచ్చే వరకు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయవద్దని టిడిపి తెలంగాణ ఫోరం ఇటీవల సవాళ్లు విసిరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పోటీ చేయకుండా ఉంటే అందుకు టిడిపి కూడా సిద్ధమని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+