రాహుల్ చెబితే..: క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక?

చాలాకాలంగా రాష్ట్ర కాంగ్రెసు నేతలు ప్రియాంక గాంధీని అమేథీ, రాయ్‌బరేలి నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని కోరుతున్నారు. అలా అయితే కాంగ్రెసుకు భారీస్థాయిలో లబ్ధి చేకూరుతుందని వారు అంటున్నారు. 2012 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పొలిటికల్ గ్రాప్ కోసం రెండు నియోజకవర్గాల పరిధి దాటి ప్రచారం చేసేందుకు ఆమె సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది. ప్రియాంక గురువారం రాయ్‌బరేలీలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ అయి అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్నారు. కాగా ఆమె వ్యాఖ్యలు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నట్లుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications