బాలయ్య ఫైట్: ఇటు జూ. ఎన్టీఆర్, అటు చిరంజీవి

Chiranjeevi-Balakrishna-Jr Ntr
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ మెగాస్టార్ చిరంజీవిని కలుపుకుంది. చిరంజీవికి, వైయస్ జగన్‌కు మధ్య రాజకీయ సమరం సాగుతుందని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి బాలకృష్ణ దూకుడుగా ముందుకు వస్తున్నారు. ఆషామాషీగా కాకుండా రాజకీయ భాషను ఒంట పట్టించుకుని ఆయన ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది. చిరంజీవి వ్యాఖ్యలపై ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్య కూడా ఆయన రాజకీయ పరిణతిని సూచిస్తోందని అంటున్నారు. అంతర్గతంగా జూనియర్ ఎన్టీఆర్‌ను, బయట చిరంజీవిని ఎదుర్కోవడానికి ఆయన ద్విముఖ పోరు సాగించేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వారసత్వ పోరు సాగించడానికి సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. పార్టీపై పట్టు సాధించాలని వీరిద్దరు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలకు కళ్లెం వేయడానికి బాలకృష్ణ దృఢంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌పై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు రావడం రాకపోవడం జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమనే పద్ధతిలో మాట్లాడారు. అంటే, జూనియర్ ఎన్టీఆర్‌కు పిలిచి బొట్టు పెట్టేది లేదని ఆయన చెప్పకనే చెప్పారని అనుకోవచ్చు. గతంలో పార్టీ కోసం చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్‌ను బాలకృష్ణకు సన్నిహితం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు కారణంగానే బాలయ్య ఆయనను దూరం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. పైగా జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయంగా అవకాశం లేకుండా తలుపులు మూసేసే పనికి సిద్ధపడ్డారు.

ఇక, కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడంలో భాగంగా చిరంజీవిపై రాజకీయ సమరం సాగించడానికి బాలకృష్ణ సమాయత్తమయ్యారనే చెప్పాలి. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. చిరంజీవితో వివాదానికి తెర తీసింది కూడా బాలకృష్ణనే. చిరంజీవి సామాజిక న్యాయ నినాదంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిపై చిరంజీవి బాలయ్య చిన్న పిల్లాడిలా మాట్లాడారని, చిన్న పిల్లల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి బాలకృష్ణ దీటైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి బాగానే నేర్చున్నారని, ఢిల్లీలో బేరసారాలు సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవితో బాలయ్య ఈ రాజకీయ సమరం మరింత ముదిరే అవకాశాలే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+