మళ్లీ రాజకీయాల్లోకి, పార్టీ తర్వాత చెప్తా: కృష్ణంరాజు

Krishnam Raju
హైదరాబాద్: తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరుతాననేది తర్వాత చెప్తానని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పార్టీకి కూడా సిద్ధాంతాలు, విధానాలు ఉన్నట్లు అనిపించడం లేదని, ఏ పార్టీ బాగుందో చెప్పడం కూడా కష్టంగానే ఉందని ఆయన అన్నారు. గతంలో ఆయన బిజెపిలో చేరి, కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అందులో చేరారు. చిరంజీవితో పొసగక పోవడంతో బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

తనకు ఇప్పుడు 34 ఏళ్ల వయస్సేనని, ఎందుకంటే తాను 34 క్రితం నుంచే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నానని, అంతకు ముందు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండేవాడినని ఆయన అన్నారు. తాను నటించిన భక్త కన్నప్ప సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయనున్నట్లు కూడా చెప్పారు. తాను సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. మితిమీరిన బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రేక్షకులు మారినా దర్శకులు మారడం లేదని ఆయన అన్నారు. తనను దర్శకులు బొబ్బిలి బ్రహ్మన్నలాగే చూస్తుండడంతో సినిమాల్లో నటించడం తగ్గించేశానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+