ఉప ఎన్నికలకు ముందే బాలయ్య తెలంగాణ పర్యటన?

దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే టిడిపి తెలంగాణ నేతలు బాలయ్యను రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. సీమాంధ్రలో బాలయ్యకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో బాలయ్య తెలంగాణలో పర్యటిస్తే పార్టీకి ఎంతో ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగూ సీమాంధ్ర, తెలంగాణలోని 24 నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలకు కాంగ్రెసు సిద్ధంగా లేదు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితం. చంద్రబాబుకు అంతగా వ్యతిరేకత కనిపించని దృష్ట్యా బాలయ్య తెలంగాణలో అడుగు పెడితే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే మరికొద్ది రోజుల్లో అంటే ఉప ఎన్నికలకు ముందే బాలయ్య తెలంగాణలో కాలుమోపవచ్చు.












Click it and Unblock the Notifications