తప్పేమిటి?: బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కామెంట్

కాగా ఇటీవల చిరంజీవి, బాలకృష్ణ మధ్య పరోక్షంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో వచ్చిన వారు ఏమీ చేయలేకనే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని విమర్శించారు. ఆ తర్వాత చిరంజీవి స్పందిస్తూ, బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బాలయ్య కూడా అంతే ధీటుగా స్పందించారు. పదవుల కోసం ఢిల్లీలో బేరసారాలు చేస్తున్న చిరంజీవి గురించి నేనేమీ మాట్లాడనని, ఆయన మాటలు నేర్చారన్నారు. తాజాగా తాను చిరుపై పోటీకి సిద్ధమని చెప్పడం, అందుకు చిరంజీవి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చని సమాధానం చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications