హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ లేకుంటే బాలకృష్ణ జైల్లో ఉండేవాడు: లక్ష్మీపార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna-Laxmi Parvathi
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రక్షించకుంటే హీరో నందమూరి బాలకృష్ణ జైలులో ఉండేవాడని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి సోమవారం ఆరోపించారు. బాలయ్యకు ప్రాణభిక్ష పెట్టింది, కేసు నుండి కాపాడింది వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన లేకుంటే జైల్లో ఉండే వారని అన్నారు. బాలయ్య గతాన్ని గుర్తుకు తెచ్చుకొని మాట్లాడాలన్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై పోటీ చేస్తే బాలయ్యకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారన్నారు. బాబుతో చేతులు కలిపిన హీరో బాలకృష్ణను చూస్తే తనకు బాధేస్తుందని అన్నారు. చంద్రబాబు వంటి నీచమైన వ్యక్తికి మద్దతు పలకడం బాలయ్యకు తగదన్నారు. బాబు అవినీతి గురించి మాట్లాడాలని సూచించారు. తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు. కోట్లకు పడగలెత్తిన బాబు అవినీతి గురించి మాట్లాడాలని సూచించారు.

వేశాలు మార్చి మోసాలు చేసే చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. బాబు ఓ నయవంచకుడు అన్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే కేసుల నుండి బయట పడటానికి చంద్రబాబు దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. అలాంటి వ్యక్తి దరిదాపుల్లోకి బాలయ్య వెళ్లవద్దన్నారు. తన తండ్రికి జరగిన వెన్నుపోటుకు పగ తీర్చుకోవాలన్నారు. నీ ఇమేజ్‌ను నీచ రాజకీయాలకు ఫణంగా పెట్టవద్దన్నారు. చక్రవర్తి కొడుకులా పుట్టిన నీవు బాబు వంటి నక్కకు పని చేస్తాననడం సరికాదని, ఆయన కుట్ర రాజకీయాలకు బలికావొద్దన్నారు. బాబు అక్రమాలు పరీక్షిస్తే నీకే అసహ్యం కలుగుతుందన్నారు. కూతురు కోసం స్వార్థంతో బాబు వెంట వెళ్లవద్దన్నారు. సినిమాల్లో పాత్రలు వేసినట్లు రాజకీయాల్లో మరో పాత్ర వేస్తున్నావని విమర్శించారు. బాబు అప్పుడు ఎన్టీఆర్ పైన వేసిన కేసు ఓసారి పరిశీలించు అన్నారు. బాబుకు మద్దతు పలికిన పక్షంలో బాలయ్య ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవద్దన్నారు.

బాలయ్య సొంత పార్టీ పెట్టి తొడల సత్తా నిరూపించుకోవాలని మండలి సభ్యుడు వై శివరామిరెడ్డి వేరుగా అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన పార్టీ నుండి పోటీ చేస్తానని బాలయ్య ప్రకటించడం సరికాదన్నారు. ఆయన రాజకీయ అపరిపక్వంతోనే అలా మాట్లాడుతున్నారన్నారు.

English summary
NTR TDP president Laxmi Parvathi accused hero Nandamuri Balakrishna for supporting TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X