బాలకృష్ణను సిఎం చేసేందుకే చంద్రబాబు: వినోద్‌కుమార్

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న చిన్న చిన్న కేసులు ఎత్తివేసి అన్ని కేసులు ఎత్తివేసినట్లు ప్రభుత్వం చూపిస్తోందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేరుగా అన్నారు. అన్ని ఎత్తివేయకుండానే ఎత్తివేసినట్లు భ్రమలు కల్పించడం సరికాదన్నారు. ఎత్తివేతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టును అండర్ గ్రౌండ్‌గా మార్చాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా వరంగల్ జిల్లా పరకాలలో డిమాండ్ చేశారు. వచ్చే నెల 4న ప్రధాని మన్మోహన్ సింగ్ రానున్న నేపథ్యంలో ప్రాజెక్టును భూగర్భంలో నిర్మించే విధానంపై దృష్టి పెట్టాలన్నారు. పైన నిర్మిస్తే దుకాణాలు, ఇళ్లు కోల్పోయి వేలాది మంది వీధిన పడతారన్నారు.












Click it and Unblock the Notifications