హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ, రామోజీ రావుకి లింక్ పెట్టిన వైయస్ జగన్ సాక్షి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక సిబిఐ, రామోజీ రావుకు లింక్ పెట్టింది. రామోజీ తానా అంటే సిబిఐ తందానా అంటోందంటూ సాక్షి కథనం రాసింది. సిబిఐ సునీల్ రెడ్డిని అరెస్టు చేయగానే ముందే వేసుకున్న పథకం రామోజీ ఈనాడు పత్రిక బరితెగింపుగా రాసిందని, సాక్షి ప్రారంభోత్సవం సందర్భంగా సునీల్‌తో జగన్ మాట్లాడుతున్న ఫోటో తీసుకొని ఎమ్మార్ విల్లాలకు చెందిన రూ.70 కోట్లు సునీల్ ద్వారా చేతులు మారాయని, కోనేరు చెప్పినట్లుగా తెలిసిపోయిందంటూ రోత కథనాన్ని రాసిందని, సునీల్ అరెస్టు ద్వారా ఓఎంసి, సాక్షిలోకి పెట్టుబడులు, ఎమ్మార్ కేసు మూడింటి దర్యాఫ్తులోనూ సిబిఐ ముందడుగు వేసినట్టు రాసిందని, అలా రాయడానికి, అసలు ఒకదానికొకటి ఏమైనా పొంతనా ఉందా అని సాక్షి ప్రశ్నించింది. డిపాజిటర్లను మోసం చేసి, కోర్టుల్లో లిటిగేషన్లు వేస్తూ తనకు తోచిన మార్గాల్లో కలాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా ముందుకెళ్తున్నారని ఆరోపించింది. రిలయన్స్ పెట్టుబడులపై కూడా కప్పిపుచ్చిందని పేర్కొంది.

మూడు కేసుల్లో జగన్‌ను ఇరికించాలని ఎల్లో సిండికేట్ తపిస్తోందో చెప్పడానికి ఆధారాలు ఇవేనని, వైయస్సార్ కుటుంబానికి, సన్నిహితులకు, వారసుడుకి చుట్టడానికి దర్యాఫ్తు సంస్థతో కలిసి ఎల్లో సిండికేట్, ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు ఎంతలా పతనమైపోతున్నదీ తెలుస్తోందని పేర్కొంది. సాధారణంగా దర్యాఫ్తు సంస్థలు తాము చెప్పని విషయాలు మీడియాలో వస్తే వివరణ ఇస్తాయని, కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదన్నది. ఎల్లో మీడియా ఎంతగా కథనాలు రాసినా సిబిఐ కిమ్మనడం లేదని, ఎవరికి తెలియని విషయాలు వారికే ఎలా తెలుస్తున్నాయన్నారు. పైగా ఆ మీడియా రాసిన కథనాల ప్రకారమే సిబిఐ తన పని చేసుకుంటూ పోతోందని, అందుకు విజయ సాయి రెడ్డి నార్కో అనాలిసిస్ పరీక్షల అంశమే ఉదాహరణ అని పేర్కొంది.

English summary
YS Jaganmohan Reddy Sakshi accused that CBI alliance with Eenadu Ramoji Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X