అప్పుడే ప్రళయం రాలేదు: జగన్‌పై మండిపడ్డ విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను గిన్నిస్ రికార్డులో చేర్చాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శుక్రవారం ఎద్దేవా చేశారు. ప్రజల సానుభూతి కోసమే జగన్ తనను కాల్చండి అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి అయితే చార్మినార్‌ను కూడా వదలరని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తనయుడు కూడా ఇంత డబ్బు సంపాదించలేదని ఆయన అన్నారు. అధిష్టానం తనకు అనుమతిస్తే జగన్ అవినీతి గురించి రాష్ట్రంలో ఊరూరా ప్రచారం చేస్తానని అన్నారు.

జగన్‌కు ఏమైనా అయితే ప్రళయం వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంటున్నారని, అత్యంత ప్రజాధరణ కలిగిన దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు మరణించినప్పుడే ప్రళయం రాలేదన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు దమ్ముంటే తమపై విచారణకు ఆదేశించాలని సవాళ్లు విసిరిన జగన్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన మానసికంగా దెబ్బతిన్నాడో మరేమో తెలియదు కానీ ఇలాంటివి సరి కావన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+