లిక్కర్ సిండికేట్ల కేసులు, అరెస్టుల పర్వం ప్రారంభం

గుంటూరు జిల్లాలో మద్యం వ్యాపారులు శ్రీనివాస రావు, సుబ్బారెడ్డిలను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. సిండికేట్ వ్యాపారులు గణేష్, పుష్కర ప్రసాద్, ఈశ్వరరావులను ఎసిబి అరెస్టు చేసింది. కొన్ని రికార్డులను, నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వరంగల్ జిల్లాలో అరెస్టులకు భయపడి మద్యవ్యాపారులు పరారవుతున్నారు. ఎసిబి అధికారులు శుక్రవారం 50 బృందాలతో 22 చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. 33 సిండికేట్లకు చెందిన దాదాపు 300 దుకాణాల్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం సిండికేట్లకు సంబంధించి ఎసిబి 750 పేజీల నివేదికను తయారు చేసింది. ఆబ్కారీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు మామూళ్ల వ్యవహారం కూడా సోదాల్లో బయటపడింది.












Click it and Unblock the Notifications