ఎమ్మార్ కేసు: విజయ రాఘవన్‌ను అరెస్టు చేసిన సిబిఐ

కాగా, సునీల్ రెడ్డిని విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు శనివారం ఉదయం దిల్‌కుషా అతిథి గృహానికి తరలించారు. సునీల్ రెడ్డిని కోర్టు సిబిఐ కస్టడీకి మూడు రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయం నుంచి సునీల్ రెడ్డిని దిల్‌కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీల్లో విజయ రాఘవన్ పాత్ర ఉన్నట్లు సిబిఐ నిర్ధారణ చేసుకుంది. ఇంతకు ముందు సిబిఐ అధికారులు విజయ రాఘవన్‌ను పలు మార్లు ప్రశ్నించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు విజయ రాఘవన్‌ను హాజరు పరిచారు.












Click it and Unblock the Notifications