తాగిన మైకంలోనే విగ్రహాల ధ్వంసం, ముగ్గురి అరెస్టు

విద్యాసంస్థలు, దుకాణాలు మూత పడ్డాయి. ఆందోళనకారులు పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు అమలాపురం చేరుకున్నారు. విగ్రహాల విధ్వంసానికి కారుకుడిగా భావిస్తున్న గంధం పల్లంరాజు పరారీలో ఉన్నాడు. ధ్వంసం చేసిన తర్వాత విగ్రహాలను ఎక్కడెక్కడ పడవేసిందీ నిందితులు పోలీసులకు చూపించారు. స్థానిక వ్యవసాయ బావిలో పడేసిన విగ్రహాలను పోలీసులు బయటకు తీసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాలుగు రోజుల క్రితం అమలాపురంలో అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం సంఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.












Click it and Unblock the Notifications