చిరంజీవి రేంజ్‌లో ఉత్తరప్రదేశ్‌లో మేం: అమర్ సింగ్

Amar Singh
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు చిరంజీవికి లభించినటువంటి మద్దతు తమకు ఉత్తరప్రదేశ్‌లో లభిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు, రాష్ట్రీయ లోక్‌మంచ్ వ్యవస్థాపకుడు అమర్ సింగ్ అన్నారు. తమకు ఉత్తరప్రదేశ్‌లో విశేషమైన మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. అమర్ సింగ్ పుట్టిన రోజును ఆయన అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్ రాష్ట్రం కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవికి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లే తమకు వస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణలో పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనను ఎప్పుడూ ఆహ్వానించలేదని ఆయన చెప్పారు. ఆహ్వానిస్తే తాను తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. ప్రత్యేక పూర్వాంచల్ రాష్డ్ర ఏర్పాటే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే మఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదనను స్వాగతిస్తూనే ఎన్నికల సమయంలో ఆ ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మాయావతి యుపి విభజనను ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+