విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ: కోర్టులో సిబిఐపై రాఘవన్

గాయాలపాలై ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిన విజువల్స్ చూపించి విల్లాల ఓనర్లను సిబిఐ బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. సిబిఐ చేసిన గాయాలు ఆయన ఒంటిపై ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. కాగా విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని రాఘవన్ చెప్పడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు. దీంతో కేసు మలుపు తిరుగుతుందో చూడాలి. రాఘవన్‌ను సిబిఐ పలుమార్లు విచారించింది. వేధింపులకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వడానికి సిద్ధమని రాఘవన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కాగా స్టైలిష్ హోం రంగారావుకు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిబిఐ, నిందితులతో కుమ్మక్కయ్యారని అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం చెప్పడం లేదన్నారు. కాగా రంగారావు బెయిల్ విచారణపై ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.












Click it and Unblock the Notifications