సునీల్ రెడ్డి కస్టడీ పొడిగింపుపై సిబిఐకి చుక్కెదురు

మరోవైపు విజయ రాఘవను తమ కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు విజయ రాఘవ తరఫు న్యాయవాది రాఘవపై సిబిఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించిందంటూ తన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడే కోర్టులో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని అడిగారు. రాఘవను సాక్ష్యాధారాలతోనే విచారిస్తున్నామని, మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు విల్లాలు వసూలు చేశారన్నారు. ఆయన అక్రమాలకు ఆధారాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications