జగన్ చుట్టూ ఉన్న అవినీతిని కాల్చేయాలి: నారాయణ

కాగా అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన వస్త్ర వ్యాపారుల బంద్ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వస్త్రాలపై వ్యాట్ ఎత్తివేయక పోతే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలు లేకుండా సోనియా గాంధీ వద్దకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గోచీ గుడ్డను కూడా వదలకుండా పన్ను వేయడంకంటే దరిద్రపు బతుకు ఉండదని ఈసడించారు. పరిస్థితి తీవ్రతను పట్టించుకోకపోతే వస్త్ర వ్యాపారులతోపాటు సామాన్య ప్రజానీకం మొత్తం కలిసి రాష్ట్ర ప్రభుత్వ బట్టలు ఊడదీయాలని పిలుపునిచ్చారు. వ్యాట్ ద్వారా రూ.600 కోట్లు వస్తాయంటున్నారని, గాలి ఆస్తులను స్వాధీనం చేసుకుంటే వేల కోట్లు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా, గుడ్డిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications