తెలంగాణ విషయంలో నా సూచనపై చర్చ జరగాలి: జెసి

ఆంధ్రా ప్రాంతం వారు ముఖ్యమంత్రి అయినప్పుడే తెలంగాణ డిమాండ్ వస్తోందని అన్నారు. మూడేళ్లు ఆంధ్ర ప్రాంతం వారికి, రెండేళ్లు తెలంగాణ ప్రాంతం వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విధానం అమలు చేస్తే ఇటువంటి సమస్యలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్న వాళ్లు జై తెలంగాణ అంటున్నారని, ఈ రాజకీయ క్రీడలో విద్యార్థులు బలపశువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల జెసి, మూడేళ్ల ఆంధ్రాకు, రెండేళ్లు తెలంగాణకు అనే ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications