విజయకాంత్‌తో జయలలిత వార్, స్నేహం చెడినట్లే

Jayalalitha-Vijay Kanth
చెన్నై: డిఎండికె చీఫ్ విజయకాంత్‌తో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహం చెడినట్లే కనిపిస్తోంది. ఇరువురు మాటల యుద్ధానికి దిగారు. శానససభ నుంచి బుధవారం విజయకాంత్‌తో సహా డిఎండికె సభ్యులను బయటకు పంపించి వేశారు. జయలలితతో డిఎండికె సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఈ వివాదం తర్వాత వారిని సభనుంచి బయటకు పంపించేశారు. అంతకు ముందు డిఎండికె సభ్యుడు చంద్రకుమార్ - ధరల పెరుగుదలపై జయలలితను ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఆయన అడిగారు. అయినా శంకరన్‌కోవిలి ఉప ఎన్నికలో తమ అన్నాడియంకె గెలిచిందని ఆమె సమాధానం ఇచ్చారు. జయలలిత వ్యాఖ్యలతో శానససభలో గందరగోళం చెలరేగింది. దీంతో డిఎండికె సభ్యలను బయటకు పంపించారు.

విజయకాంత్ మద్దతు లేకపోయినా తమ పార్టీ గెలిచి ఉండేదని జయలలిత అన్నారు. డిఎండికెతో చేతులు కలిపినందుకు ఇప్పుడు విచారిస్తున్నామని ఆమె అన్నారు. ఆమె మాటలకు విజయకాంత్ ధాటిగానే సమాధానం ఇచ్చారు. తమ పార్టీ వల్లనే శానససభ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె గెలిచిందని ఆయన అన్నారు. అవసరం తీరిన తర్వాత తమను జయలలిత వెళ్లిపొమ్మంటున్నారని ఆయన విమర్శించారు. శానససభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. విజయకాంత్ నాయకత్వంలోని డిఎండికెకు గతంలో కన్నా ఎక్కువ సీట్లే వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+