కర్తవ్యం ముద్దుకృష్ణ పాత్రధారి పుండరీ కాక్షయ్య మృతి

Pundari Kakshayya
చెన్నై: ప్రముఖ నటుడు, నిర్మాత పుండరీ కాక్షయ్య గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. పుండరీ కాక్షయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ. ఆయన 1925 ఆగస్టు 19వ తేదిన జన్మించారు. భక్త ప్రహ్లాద ఆయన నటించిన మొదటి చిత్రం. ఆ తర్వాత పోలీస్ బ్రదర్స్, తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య, పల్లెటూరు, రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత, జయసింహ, అమ్మలక్కలు తదితర చిత్రాల్లో నటించారు. ఈయన వయస్సు 87.

లేడీ ఆమితాబ్ విజయశాంతి కర్తవ్యం చిత్రంలో ఆయన ముద్దుకృష్ణ పాత్రలో నటించారు. ఈ చిత్రం ఆయనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు, త్రివిక్రమ రావులతో కలిసి ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్‌ను ప్రారంభించారు. ఆరాధన, మహామంత్రి తిమ్మరుసు తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం రాఘవయ్యగారి అబ్బాయి. 8 నుండి 10 చిత్రాల వరకు ఆయన నిర్మించారు. ఆయన రచయితగా కూడా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+