అప్పుడు చిరంజీవే బెస్ట్ ఆప్షన్: బివి రాఘవులు నివేదిక

ఖమ్మంలో జరుగుతున్న సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలో ఆ పార్టీ నేతలు మొదటి రోజు గురువారం కీలక చర్చలు చేశారు. నాలుగేళ్ల కాలంలో చేసిన తప్పులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, చేయాల్సిన పోరాటాలపై చర్చలు చేశారు. భవిష్యత్ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా బూర్జువా పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో 11 వామపక్ష పార్టీలతో కూటమి కట్టి రాష్ట్రంలోని వంద స్థానాలను టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరుండాలనేది నిర్ణయించేది తామే అవుతామనే చర్చ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో జతకట్టాలనే విషయంపైనా, సమైక్య వాదంపైనా సమీక్ష జరిగింది. తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో తాము బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలో మౌనంగా ఉన్నామని, కోస్తా ప్రాంతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు చేపట్టలేదని, ఈ విధానంతో లాభం చేకూరిందని సీపీఎం సూత్రబద్ధ వైఖరికి కట్టుబడి ఉందన్న అభిప్రాయం రాష్ట్రం అంతా వ్యక్తమైందని రాఘవులు తన నివేదికలో వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications