జై తెలంగాణ సినిమా బాగుంది, హిట్ చేయండి: కెసిఆర్

కాగా పలువురు తెలంగాణవాదులు, టిఆర్ఎస్ నేతలు ఆయా ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తిలకించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, సిద్దిపేటలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణం భవాని థియేటర్‌లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఈ చిత్రాన్ని చూశారు. కాగా గతంలో తెలంగాణ అంశంతో వచ్చిన శంకర్ జైబోలో తెలంగాణ, ఆర్ నారాయణ మూర్తి పోరు తెలంగాణ సినిమాలను కూడా కెసిఆర్ చూశారు. తెలంగాణ బతుకుకు ఆ చిత్రాలు అద్దం పడుతున్నాయని చూడాలని అప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications