వీడిన మాజీ మావోయిస్టు పుష్ప హత్య కేసు మిస్టరీ

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన చిన్ననాటి మిత్రుడు ప్రభాకర్ నగరంలోని నానక్‌రాంగూడకు చెందిన ఓ స్థలం వివాదాన్ని సెటిల్ చేయాల్సిందిగా పుష్పకు అప్పగించాడు. సదరు భూ వివాదాన్ని సెటిల్ చేశాక వచ్చిన 20 శాతం వాటాను ఇద్దరూ కలిసి పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పుష్ప భూ యజమాని జయరాంసింగ్ కోర్టులో గెలిచే విధంగా కృషి చేసింది. వివాదానికి కారణమైన నానక్‌రాంగూడలోని సర్వేనెంబర్ 2/ఎ, 3 లోని ఎకరా 2 గుంటల భూమిని జయరాంసింగ్‌కు అమ్మిన వ్యక్తి తర్వాత సినీ డైరెక్టర్ తేజకు కూడా ఆ స్థలాన్ని విక్రయించాడు. దీంతో సదరు స్థలాన్ని తేజ తన అధీనంలోకి తీసుకున్నాడు. దీంతో ఖంగుతిన్న జయరాంసింగ్ స్థల వివాదం పరిష్కరించి అమ్మిపెట్టాల్సిందిగా మోమిన్‌పేట్ కానిస్టేబుల్‌ను ఆశ్రయించాడు. దీంతో ప్రభాకర్ ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా పుష్పను కోరాడు.
ఈ క్రమంలో స్థలం కేసు గెలిచిన అనంతరం పుష్ప నేరుగా భూ యజమాని జయరాంసింగ్‌తో ఆర్థిక లావాదేవీలు నడిపి కేసు అప్పగించిన ప్రభాకర్‌ను పక్కకు పెట్టింది. ఇదే సమయంలో స్థలంపై కబ్జాలో ఉన్న సినీ డైరెక్టర్ తేజ మనుషులను ఖాళీ చేయించేందుకు మోమిన్‌పేట్‌కు చెందిన మరో కానిస్టేబుల్ కుమారుడు, అప్పటికే ఓ హత్యకేసులో నిందితుడైన మోకిల శ్రావణ్‌కుమార్‌తో రూ. 8 లక్షలకు పుష్ప ఒప్పందం కుదుర్చుకుంది. చివరకు శ్రావణ్‌కుమార్‌కు కూడా ఆమె మొండి చేయిచూపింది.దీంతో కానిస్టేబుల్ ప్రభాకర్, శ్రావణ్‌కుమార్, పుష్పపై కక్ష పెంచుకొని హత్య చేసేందుకు పథకం వేశారు. ఇందుకు ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎండీ.అహ్మద్ (22), వికారాబాద్‌కు చెందిన గులాంగౌస్ (23), షేక్ హతీక్ (20), ఎండీ.కరీం(18), ఎండీ.నయీమొద్దీన్ అలియాస్ నయీమ్(18)ను ఎంచుకొన్నారు. పుష్పను హత్య చేస్తే రూ. 6 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు జనవరి 12న పుష్పను హత్య చేసేందుకు సదరు వ్యక్తులు ప్రగతినగర్‌లోని ఆమె నివాసానికి వెళ్ళారు. ఆ రోజు హత్యకు పరిస్థితులు అనుకూలించపోవడంతో వెనుదిరిగారు. వీరిలో శ్రావణ్‌కుమార్, ఎండీ.అహ్మద్ అదే రోజు రాత్రి ఎల్బీనగర్‌లోని పద్మవంశీ లాడ్జిలో బసచేశారు. మరుసటి రోజు 13వ తేదీ ఉదయం వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై మళ్ళీ పుష్ప నివాసానికి వచ్చారు.పై అంతస్థులో గడియ వేయకుండా ఉన్న తలుపును తెరుచుకొని లోపలికి వెళ్ళి సోఫాపై నిద్రిస్తున్న పుష్పపై ఒక్కసారిగా దాడి హత్య చేశారు.












Click it and Unblock the Notifications