జగన్ కేసు: ఐఎఎస్ రత్నప్రభను ప్రశ్నించిన సిబిఐ

కాగా, అనారోగ్యంతో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేరిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య కోలుకున్నారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఆయనను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి ముద్దాయి అయిన బిపి ఆచార్యను సిబిఐ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయినప్పటి నుంచి ఆయన ఏదో విధమైన అస్వస్థతతో బాధపడుతున్నారు. మరో వైపు ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన విజయ రాఘవన్‌ను, సునీల్ రెడ్డిని సిబిఐ అధికారులు శనివారం విచారించారు. వారిద్దరిని కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications