అక్షరాలా రూ.10లక్షలు..విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఆఫర్!

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే 'పీఎం విద్యాలక్ష్మి స్కీమ్' . ఈ పథకం కింద దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే విద్యా రుణాలు అందిస్తారు. ప్రతిభ ఉండి, పైచదువులు చదవాలనుకునే మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి.

పీఎం విద్యాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశాలు:

విద్యార్థులు వేర్వేరు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఒకే పోర్టల్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 7.5 లక్షల వరకు రుణం తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం 3 శాతం వడ్డీ సబ్సిడీని అందిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలకు ఎలాంటి గ్యారెంటీ లేదా కో-అప్లికెంట్ అవసరం లేదు.

PM Vidyalaxmi Education Loan Scheme Rs 10 Lakhs for Students from the Central Government

అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన దేశంలోని టాప్-860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఇందులో ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటాయి. అడ్మిషన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్షల ద్వారా సాధించి ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే

దీని కోసం విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యాసంస్థలో సీటు వచ్చినట్లు తెలిపే అడ్మిషన్ లెటర్ మరియు ఫీజ్ స్ట్రక్చర్ రశీదు కావాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మార్కుల పత్రాలు, కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు కావాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

ముందుగా పీఎం విద్యాలక్ష్మి అధికారిక వెబ్‌సైట్ (PM Vidyalaxmi Portal) ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న 'Register' ఆప్షన్‌పై క్లిక్ చేసి విద్యార్థి పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఈమెయిల్‌కు వచ్చే యాక్టివేషన్ లింక్‌ను క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 'Common Education Loan Application Form (CELAF)' పై క్లిక్ చేయాలి.

దరఖాస్తు ఇలా సబ్మిట్ చెయ్యాలి

ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, అకడమిక్ వివరాలు మరియు కోర్సు ఫీజు వివరాలను తప్పులు లేకుండా భర్తీ చేయాలి. మీ వివరాల ఆధారంగా పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివిధ బ్యాంకులు, వాటి విద్యా రుణ పథకాల జాబితా కనిపిస్తుంది. మీ అవసరానికి తగిన బ్యాంక్ మరియు లోన్ మొత్తాన్ని ఎంచుకుని, అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తును పూర్తిగా పరిశీలించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడీ వస్తుంది. దీని ద్వారా మీ లోన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+