జగన్‌కు జూడాలంటే తెలియదు: డిఎల్ రవీంద్రా రెడ్డి

సమ్మె విరమిస్తేనే తాము జూనియర్ డాక్టర్లతో చర్చలు జరుపుతామని ఆయన తెగేసి చెప్పారు. చర్చల విషయంలో నిర్ణయం జూడాల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగానే ఉందని ఆయన చెప్పారు. జూనియర్ డాక్టర్ల నిరసన విశాఖపట్నంలో ప్రారంభమై క్రమంగా రాష్ట్రమంతా వ్యాపించిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు స్టయిఫండ్ చెల్లింపులో జాప్యం చేస్తూ పెండింగులో ఉంచాయని, తాను వచ్చిన తర్వాత స్టయిఫండ్ చెల్లింపులను క్రమబద్ధం చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications