అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో సిఎం ఎదురుచూపులు

kiran kumar reddy
న్యూఢిల్లీ: మంత్రి వర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ఆదివారం నిరీక్షిస్తున్నారని తెలుస్తోంది. శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన కిరణ్ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2జి కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరంకు ఊరట లభించే విధంగా తీర్పు రావడంతో కిరణ్‌కు అపాయింటుమెంట్ దొరికింది. సోనియాతో కేవలం ఐదు నిమిషాల్లోనే కిరణ్ భేటీ ముగిసింది. దీంతో సిఎం ఆదివారం మరోసారి వారిని కలిసేందుకు అక్కడే ఉన్నారు. అయితే ఉదయం నుండి నిరీక్షించినా ఆయనకు సాయంత్రం వరకు అపాయింటుమెంట్ దొరకలేదు. ఆయన మాత్రం సోనియా అపాయింటుమెంటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరణకు అధిష్టానం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. సిఎం మాత్రం విస్తరణకు ఎలాగైనా అనుమతి తీసుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

శనివారం సోనియాతో భేటీ నిమిషాల్లోనే ముగిసి పోవడం, ఆదివారం సాయంత్రం వరకు అపాయింటుమెంటు దొరక్క పోవడంతో కేబినెట్ ఆశావహుల్లో అయోమయం నెలకొంది. కిరణ్ మంత్రి వర్గ విస్తరణ కోసమే ఢిల్లీ వెళ్లారనే వార్తల నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిఎం ఎదురుచూపుల నేపథ్యంలో అసలు సిఎం వచ్చింది కేబినెట్ విస్తరణ అంశం గురించా లేక మరో విషయమా అనే ఆసక్తికరమైన చర్చకు తెరలేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+