ఫ్యాక్షనిస్టును హత్య చేసిన వారిని పట్టుకోలేదు: కెటిఆర్

నిరుపేద ఆటో డ్రైవర్లను వేధించే బదులు కాంగ్రెస్‌లోని అసాంఘిక శక్తులను పట్టుకోవచ్చు కదా, వాళ్లను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఒక ఫ్యాక్షనిస్టును హత్య చేసి పారిపోయిన వ్యక్తిని ఇంతవరకు పట్టుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరుల కుటుంబాలను టిఆర్ఎస్ ఆదుకుంటుందని ఆ పార్టీ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు వేరుగా చెప్పారు. ఈ విషయంలో వస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పార్టీ నేతలందరూ ఎవరి స్థాయిలో వారు ఎవరికి తోచినంత వారు అమరుల కుటుంబాలకు, ఉద్యమంలో పాల్గొని రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications