తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నియంత్రించాలనుకోవద్దు: చినజీయర్‌పై రామచంద్రయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చినజీయర్ స్వామి ఒక్కరే నియంత్రించాలని అనుకోవడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఆదివారం అన్నారు. భక్తుడిగా ఎవరి అభిప్రాయాలు చెప్పినా స్వీకరిస్తామని చెప్పారు. అందరి అభిప్రాయాలను తాము గౌరవిస్తామన్నారు. కానీ నియంత్రించాలని అనుకోవడం సరికాదన్నారు. దేవాలయ భూముల పరిరక్షణకు ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. వారం రోజుల్లో దేవాలయాల ఆస్తులను ఆన్ లైన్‌నో ఉంచుతామని చెప్పారు. ఎమ్మార్ కేసులో ఎల్‌వి సుబ్రహ్మణ్యం విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు.

కాగా ఇటీవల చినజీయర్ స్వామి టిటిడి తీరుపై మండిపడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆయన టిటిడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. రెండు రోజుల క్రితం మహాయజ్ఞం నిర్వహించిన అనంతరం ఆయన టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎదుటే తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అనంతరం తిరుపతి నుండి తిరుమలకు ఆలయ పవిత్రత కాపాడాలంటూ పాదయాత్ర చేపట్టారు.

English summary
Minister C Ramachandraiah blamed Chinna Jeeyar Swami for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X