ఐఏస్‌ల పైనా నమ్మకం పోతోంది: తప్పుపట్టిన ఉండవల్లి

Undavalli Arun Kumar
విజయవాడ: రాజకీయ నేతలంటే ప్రజల్లో ఎప్పుడో నమ్మకం పోయిందని, తాజాగా ఐఏఎస్‌లు అంటే కూడా ప్రజలకు నమ్మకం పోతోందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం కృష్ణా జిల్లాలో అన్నారు. రాజకీయ నేతల్లాగే అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు. చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

కాగా సిబిఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారులు పలువురు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ, సిబిఐ కేవలం తమనే టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు. పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. దీనిపై ఉండవల్లి రాజమండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+