చేతులెత్తేసిన డిఎల్ రవీంద్రా రెడ్డి, శైలజానాథ్ ఎంట్రీ

జూనియర్ డాక్టర్ల సమ్మె ముడి వీడకపోవడానికి ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారి కారణమనే మాట వినిపిస్తోంది. ఆ అధికారిని పట్టుబట్టి రవీంద్రా రెడ్డి తన ఆరోగ్య శాఖ నుంచి బదిలీ చేయించారు. అయితే ఆయన ఏకంగా ఆర్థిక శాఖలో తిష్ట వేశారు. ఆయనే డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రయత్నాలకు గొల్లెం పెట్టినట్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్ మేరకు స్టయిఫండ్ పెంచడానికి రవీంద్రా రెడ్డి సిద్దపడ్డారు. ఆ విషయంపై బహిరంగ ప్రకటన కూడా చేశారు. అయితే, ఆ అధికారి రవీంద్రారెడ్డిని ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్ పెంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి సూచించినట్లు చెబుతున్నారు. దీంతో రవీంద్రా రెడ్డి ఇచ్చిన హామీ కాస్తా అమలు కాకుండా పోయింది. అదే సమయంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి మంత్రి వర్గ ఉపసంఘానికి అప్పగించారు. ఆ ఉప సంఘం కూడా సమస్యను పరిష్కరించలేకపోతోంది. ఏమైనా, ఓ ఉన్నతాధికారి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై పెట్టుకున్న కోపం కాస్తా జూనియర్ డాక్టర్ల సమ్మె ముదరడానికి కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications