తెలుగులో వన్ ఇండియా తెలుగు విశేషమైన ఆదరణ పొందిన పోర్టల్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులకు ఎప్పటికప్పుడు వార్తలను, వార్తావిశేషాలతో పాటు వివిధ అంశాలపై తాజా కథనాలను అందిస్తోంది. వన్ ఇండియా తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేయడానికి జర్నలిస్టు కావాలి. ఇంగ్లీషులో, తెలుగులో తగిన భాషాపరిజ్ఞానం అవసరం. అనువాదంలో దిట్ట అయి ఉండాలి. కింది స్థాయి జర్నలిస్టులు చేసే అనువాదాలను పరిశీలించి, సరిదిద్దగలిగి ఉండాలి. తెలుగులో రాసే వార్తలను సరిదిద్ది ప్రసారానికి యోగ్యంగా తయారు చేయాల్సి ఉంటుంది. వారికి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన యాజమాన్య నైపుణ్యాలు కూడా అవసరం. బెంగళూర్‌లో పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి.
అందుకు తగిన అర్హతలు ఉండి, బెంగళూర్‌లో పనిచేయడానికి సిద్ధపడినవారు తమ వివరాలను అందించాలని కోరుతున్నాం. వివరాలను అభ్యర్థులు [email protected] అనే మెయిల్‌కు పంపించగలరు. ప్రతిభకు తగిన వేతనం ఉంటుంది.