• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాకూబ్ రెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీం స్టే

By Pratap
|

Supreme Court
న్యూఢిల్లీ: తెలంగాణ విద్యార్థి యాకూబ్ రెడ్డి కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. యాకూబ్ రెడ్డిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై గత 11 రోజులుగా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు సోమవారం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మధ్య కాలంలో వరంగల్‌లో యాకూబ్ రెడ్డిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.

వరంగల్ జిల్లాలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి యాకూబ్ రెడ్డిపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జనవరి 5వ తేదీన సిబిఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ గులాం అహ్మద్, జస్టిస్ కెజి శంకర్‌తో కూడిన ధర్మాసనం మూడు నెలల్లో దాడికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సిబిఐని ఆదేశించింది. నిరుడు తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపై దాడి చేసిన సంఘటనలో యాకూబ్ రెడ్డి నిందితుడు. ఇతనిని పోలీసులు నిరుడు ఆగస్టు 7వ తేదిన అరెస్టు చేశారు. అతనిని పోలీసులు పలు పోలీసు స్టేషన్లు తిప్పి దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో యాకూబ్ కిడ్నీ, కాళ్లూ పోగొట్టుకున్నాడు. దీనికి స్థానిక డిఎస్పీ కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణవాదులు పలుమార్లు డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం హర్షదాయకమన్నారు. నాలుగు నెలల క్రితం యాకూబ్ తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని హైకోర్టును ఆశ్రయించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme Court issued stay orders on CBI probe in Kakatiya University student Yakoob Reddy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more