రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రా

ప్రజలు కోరితే తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి తన కుటుంబ సభ్యులకు తాను సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్, ప్రియాంకలకు తన అవసరం లేకపోయినా తన వంతుగా మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని తాను మూలమూలలకు తీసుకుని వెళ్తానని, దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని అడిగితే తాను ఆ విషయం మాట్లాడబోనని, రాహుల్ మాత్రమే దాని గురించి మాట్లాడాలని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications