సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతి కేసు కొట్టివేత

అనిల్ రెడ్డి తన ప్రియురాలు శాలిని ఇంట్లో నిరుడు ఏప్రిల్‌లో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం వారు ప్రియురాలిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ వైద్యుల నివేదికలో అనిల్ రెడ్డి తలకు గాయాలు ఉన్నాయని తేలింది. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యుల నివేదికలో గాయాలు లేనట్లుగా తేలింది. అనిల్ రెడ్డి మృతి సహజమైనదే అని రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. అయితే, అనిల్ రెడ్డిది సహజ మరణమేనని శాలిని కుటుంబ సభ్యులు వాదించారు.












Click it and Unblock the Notifications