వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు టైమ్‌లో సామర్లకోట పవర్ ప్రాజెక్టు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Samalkot 2400 MW Power Project
సామర్లకోట: రాష్ట్రంలోని సామర్లకోటలో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చేపట్టిన 2400 మెగావాట్ల ప్రాజెక్టు రికార్డు సమయంలో పని ప్రారంభానికి సిద్ధమవుతోంది. దేశంలోని అతి భారీ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ 15 నెలల కాలంలో పూర్తవుతోంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. రిలయన్స్ పవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెపి చలసాని సామర్లకోటలో కొద్ది మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం 15 నెలల కాలంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పవర్ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనతను తాము సాధించామని ఆయన అన్నారు. పూర్తి సామర్థ్యం కంబైన్డ్ సైకిల్ ద్వారా 2012 చివరినాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.

సామర్లకోట పవర్ ప్రాజెక్టు నిర్మాణం తమ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి గృహ వినియోగ సహజ వాయు కేటాయింపుల కోసం తాము నిరీక్షిస్తున్నామని, దక్షిణాదికి వాతావరణ సమతుల్యతను కాపాడే క్లీన్ అండ్ గ్రీన్ పవర్ గ్యాస్ అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కెజి బేసిన్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇంధన కొరతను ఎదుర్కుంటున్న దక్షిణాది అవసరాలను తీరుస్తుందని ఆయన చెప్పారు. సామర్లకోట పవర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుదుత్పత్తి మొత్తంలో 15 శాతాన్ని పూరిస్తుంది.

English summary
India’s largest gas-based power plant, the Rs. 10,000 crore Samalkot 2400 MW project, located close to India’s east coast in Andhra Pradesh, is ready for commissioning in a record time of 15 months. This was announced by Reliance Power Limited, a Reliance Group company, here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X