బాత్‌రూంలో జారిన సినీ గాయని జానకి, తలకి గాయం

కాగా జానకి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ తదితర పలు భారతీయ భాషల్లో పాటలు పాడింది. ఈమె నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డులు పొందింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 31 ఫిల్మ్ అవార్డులు పొందింది. ప్రముఖ గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకులు ఇళయరాజాలతో ఈమె కాంబినేషన్‌లో చాలా వచ్చాయి. ఈమెను నైటెంగిల్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. ఈమె స్వగ్రామం గుంటూరు జిల్లాలోని రేపల్లె. పదహారేళ్ల వయసు, ఆకలి రాజ్యం, అభిలాష, సితార, చాలెంజ్, సాగర సంగమం, స్వాతి ముత్యం, ప్రేమించు పెళ్లాడు, ఖైదీ నెంబర్ 786, బొబ్బిలి రాజా, కొండవీటి దొంగ, నిర్ణయం, కిల్లర్, ఆలాపన, చిన్నరాయుడు, అంతపురం తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఎస్పి బాలు, రాజ్ కుమార్, పిబి శ్రీనివాస్, ఘంటశార, సుశీల, వాణీ జయరామ్ తదితరులతో కలిసి పాటలు పాడింది.












Click it and Unblock the Notifications