నిరసనలతో మాల్దీవుల అధ్యక్షుడు నషీద్ రాజీనామా

మాజీ మానవ హక్కుల కార్యకర్త అయిన నషీద్ బహుళ పార్టీలు పాల్గొన్న ఎన్నికల్లో దేశంలో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న పాలకుడిని ఓడించారు. ఇటువంటి స్థితిలో నషీద్ పతనం ఆశ్చర్యకరమైన విషయమే క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మొహమ్మద్ అరెస్టు చేయాలని సైన్యానికి ఇచ్చిన ఆదేశాలు నషీద్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరడానికి కారణమైంది. మొహమ్మద్‌ను విడుదల చేయాలని ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ సర్వీసెస్ కమిషన్, ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సూచించాయి. న్యాయమూర్తి రాజకీయ వివక్ష చూపించారని, అవినీతిపరుడని ప్రభుత్వం విమర్శించింది.












Click it and Unblock the Notifications