విచారణకు సిద్ధం, సిఎంనడిగితే ఓకే చెప్పారు: మోపిదేవి

ఎక్సైజ్ శాఖ గాడి తప్పిందని తాను ఎప్పుడో చెప్పానని, దానిని సవరించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరకు అమ్మాలని తాను ఆదేశించినందు వల్లే కొందరు తనపై కోపంతో ఉన్నారన్నారు. అందుకే తన పేరు ఉద్దేశ్య పూర్వకంగా చెబుతున్నట్లుందన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు తన హయాంలో ప్రక్షాళన చేస్తున్నానని అన్నారు. విచారణ అనంతరం నా ప్రతిష్టకు భంగం కలిగించిన అందరిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. తాను గౌరవ ప్రదమైన కుటుంబంలో పుట్టానని చెప్పారు. తన తల్లిదండ్రుల క్రమశిక్షణలో నైతిక విలువలతో పెరిగానని అన్నారు. తాను రూపాయికి ప్రాధాన్యత ఇచ్చే వాడిని కానని, నైతికతకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తే తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
ముడుపుల విషయం విచారణ జరిపితే కొద్ది రోజుల్లో అన్నీ బయటకు వస్తాయన్నారు. తనకు ఎవరితోనైతే డబ్బులు పంపానని రమణ చెప్పారో, ఆ వ్యక్తి రాత్రే దానిని ఖండించారని అన్నారు. తనకు మంత్రికి ఎలాంటి సంబంధం లేదని మీడియోటర్‌గా రమణ పేర్కొన్న వ్యక్తి చెప్పారన్నారు. మద్యంను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్మితే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అధికారిపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications