హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ఇంటికి కిరణ్ కుమార్, అనిల్‌కు విప్ పదవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆబ్కారీ మంత్రి పాత్రపై, ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా శాసనసభ్యుడు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవితో ఆయన దాదాపు 50 నిమిషాల పాటు చర్చించారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన అనిల్‌కు విప్ పదవి ఇచ్చే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవులు ఇచ్చారు. చిరంజీవి మూడు ప్రాంతాల నుంచి ముగ్గురికి మంత్రి పడవులు అడిగారు. అయితే, తెలంగాణకు చెందిన శాసనసభ్యుడికి మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో తెలంగాణకు చెందిన అనిల్‌కు విప్ పదవి ఇస్తే ముఖ్యమంత్రి అడిగినట్లుగా మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారు. అయితే, వంగా గీత పేరు కూడా ముందుకు వస్తోంది.

కాగా, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన రవీంద్రా రెడ్డి తనపై తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య ఆ జిల్లా రాజకీయాలను ఏ మేరకు ముందుకు నడిపిస్తారనే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అలాగే, రాబోయే ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను చిరంజీవి తీసుకునే విషయంపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లడానికి ముందే రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

చీఫ్ విప్‌గా వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డిని, విప్‌లుగా ఆరేపల్లి మోహన్, ద్రోణం రాజు శ్రీనివాస్‌లను నియమించే విషయంపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో సాంకేతిక విలీనం చేసే విషయంపై కూడా మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవిని శాసనసభా పక్ష ఉప నేతగా నియమించి సభలో ముందు వరుస సీటు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు ఆదాకు ముఖ్యమంత్రి బచత్ ల్యాంప్ యోజను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీని గురించి కూడా ఆయన చిరంజీవికి వివరించినట్లు చెబుతున్నారు.

English summary
CM Kiran Kumar Reddy met MLA and Congress leader Chiranjeevi to discuss about the appointments of Whips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X