సినీ నిర్మాత కారును ఎత్తుకెళ్లిన జ్యోతిష్కుడి అరెస్టు

గోకరాజు శశికుమార్ చేత స్టాంపు పేపర్‌పై బలవంతంగా సంతకాలు చేయించాడు. శశికుమార్ తీసుకున్న అప్పు వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందని పోలీసులు చెప్పారు. ఐదు లక్షల రూపాయలు చెల్లించే వరకు కారును ఇవ్వబోనని గోకరాజు శశికుమార్‌కు చెప్పాడు. వెంటనే శశికుమార్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముషీరాబాద్‌లోని గోకరాజు నివాసంలో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో గోకరాజు ఈ ప్రణాళిక రచించి అమలు చేసినట్లు చెబుతున్నారు. తాను ముందు రచించుకున్న ప్రణాళిక ప్రకారం శశికుమార్ కదలికలపై నిఘా పెట్టి గోకరాజు ఆ చర్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications