భయపడే సిఎం బొత్స ఇలాకాను వదిలేశారు: బాబు

Chandrababu Naidu
విశాఖపట్నం: తన పదవి పోతుందని భయపడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిని విజయనగరం జిల్లాలోని మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు చేయించడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పదవిని కాపాడుకోవడానికే కిరణ్ కుమార్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు 31 మద్యం దుకాణాలున్నాయని బొత్స సత్యనారాయణ చెప్పారని, అయినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఎసిబి దాడులు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల నుంచి లంచం తీసుకున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వంద మంది శానససభ్యులకు, 8 మంది మంత్రులకు, పలువురు పార్లమెంటు సభ్యులకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు జిల్లాలవారీగా వందలాది మద్యం షాపులు తీసుకున్నారని ఆయన అన్నారు. కంచె చేను మేసే విధంగా పరిస్థితి ఉందని ఆయన అన్నారు. గనులను దోచి బంగారు కుర్చీలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నారని, ఓదార్పు యాత్ర చేస్తున్న వైయస్ జగన్‌ను ఓదార్చాల్సిన స్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+